Sunday, June 18, 2017

ఎలా పరిచయం అయ్యావో తెలియదు, ఎలా ప్రేమను పంచుకున్నామో తెలియదు, ఎలా దగ్గర అయ్యామో తెలియదు, కానీ నీ ప్రేమను చూసాను కానీ నీ గుండె చప్పుడును విన్నాను, నీ ఆవేదనను గమనించాను ఈ బంధం శాశ్వతం కావాలనుకుంటున్నా, ఈ ప్రేమ చిరకాలం ఉండాలనుకుంటున్నా, ఈ అనురాగం చిరకాలం నిలవాలనుకుంటున్నా, మనల్ని నిజంగా ఆ భగవంతుడు ఇలా కలిపాడు అన్నది నిజమే అయితే.....? నాకు నీ ప్రేమ కావాలి నాకు నీ అనురాగం కావాలి నాకు నీ కోపం కావాలి నాకు నీ అన్వేషణ కావాలి నాకు నీలోనే నన్ను ఉంచిన నువ్వు కావాలి ఎప్పటికీ ఎన్నటికీ నేనే నువ్వు అయినప్పుడు నువ్వు నేనుగా మారినప్పుడు నువ్వు నేను ఒక్కటైనప్పుడు నువ్వు ...! అంటే నేను అనేగా అర్ధం,

No comments:

Post a Comment